పవన్ మరోసారి రాజకీయ రంగంలోకి రానున్నాడా? నిజంగా తె.దే.పా లో చేరనున్నాడా? ప్రస్తుతానికి ఫిలింనగర్ లో ఈ రెండు ప్రశ్నలు రాజ్యమేలుతున్నాయి. అయతే ఇప్పటివరకూ పవన్ గానీ తె.దే.పా పార్టీ గానీ ఈ వార్తకు సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ వార్తపై ఊహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి
కొంతమంది ప్రముఖులు మరియు అభిమానులు ఇవి కేవలం పుకార్లు అని కొట్టిపారేస్తున్నా టాలీవుడ్ కు సంబంధించిన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం వీటిని కొట్టిపారేయలేమట. కాకపోతే కొందరు ఆకతాయి అభిమానులు ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లలో పవన్, తె.దే.పా పార్టీకి మద్దతు ఇచ్చినట్టు ఫోటోలను ప్రచారంలోకి తెస్తున్నారు. ఒక వర్గం మీడియా అయితే పవన్ బాలకృష్ణను కలిసాడంటూ ప్రచారం జరిగింది. కానీ మాకు ఇంతవరకూ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎం చేస్తాడు? ప్రజల మధ్య ఉన్న్న ఈ అనిశ్చితి తొలగించే స్టేట్మెంట్ ఇస్తాడా? అసలా ఈ వార్త వెంక నిజం ఉందా??లేక కేవలం పుకారా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సినిమా ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు