మహేష్ సినిమాలో పబ్ సాంగ్ కోసం స్పెషల్ కెమెరా


సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి సంభందించిన కొంత సమాచారం మాకు లభించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ అధ్వర్యంలో ఒక పాట చిత్రీకరిస్తుండగా ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ముంబై నుండి 12 ఎమ్ఎమ్ రెడ్ కెమెరా తెప్పించారు. గతంలో సుకుమార్ తో కలిసి ఆర్య, జగడం మరియు రోబో వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలకు పనిచేసిన రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు వరకు పాట చిత్రీకరణ చేసి రేపటి నుండి ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునాడు.

Exit mobile version