వైజాగ్లో ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న నటి సౌమ్య

వైజాగ్లో ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న నటి సౌమ్య

Published on Nov 20, 2012 12:43 AM IST


“ముగ్గురు” చిత్రంలో ఒకానొక కీలక పాత్ర పోషించిన సౌమ్య బోల్లప్రగడ వైజాగ్లో ఫిలిం స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైజాగ్లో రామానాయుడు ఫిలిం స్టూడియోతో కలిసి స్కూల్ ప్రారంభిస్తున్నారు. సౌమ్య కొద్ది రోజుల క్రితం “అప్లాజ్ – ది థియేటర్ పీపుల్” అనే థియేటర్ గ్రూప్ ని స్థాపించారు ఈ గ్రూప్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా నిర్వహించింది.త్వరలో సౌమ్య ,శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న “పొగ” చిత్రంలో కనిపించనున్నారు. ఈ నటికీ దర్శకత్వం మీద చాలా ఆసక్తి ఉంది. గతంలో కోన వెంకట్ రచించిన ఇంగ్లీష్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు