మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే ఈ సినిమా షూట్ రీస్టార్ట్ అయింది. ఇందులో చిరు కూడ పాల్గొనాల్సి ఉన్నా కరోనా పాజిటివ్ అని ఫాల్సీ రిపోర్టులు రావడంతో కన్ఫ్యూజ్ అయి ఆయన షూటింగ్లో జాయిన్ కాలేకపోయారు. ఆ తరవాత నెగెటివ్ అని తేలడంతో తిరిగి షూట్లో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుండి ఆయన సెట్స్ మీదకి రానున్నారట. ప్రస్తుతం కొరటాల చిరు లేకపోయినా ఇతర తారాగణంతో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో క్రేజీ స్టార్ సోనూ సూద్ కూడ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభం కావడంతో ఆయన కూడ చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ చిత్రంలో సోనూ పాత్ర కేవలం ఆర్డినరీ పాత్రలా కాకుండా మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొరటాల తన ఎవరు గ్రీన్ ఫార్ములా అయినా కమర్షియాలిటీ, సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి.