ఆ అంటే అమలాపురం రిమేక్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్న సోను సూద్

ఆ అంటే అమలాపురం రిమేక్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్న సోను సూద్

Published on Apr 7, 2012 7:11 PM IST


సోను సూద్ తెలుగు లో భారీ విజయం సాదించిన చిత్రం “ఆ అంటే అమలాపురం” పాట హక్కులను తన చిత్రం “మాగ్జిమం” చిత్రం కోసం కొన్నట్టు గతంలో తెలిపాము. ఒకానొక సమయంలో ఈ పాటకు టబు నృత్యం చేయ్యబోతున్నారని పుకార్లు కూడా నడిచాయి. కాని నిర్మాతలు బ్రిటిష్ మోడల్ అయిన హజేల్ కీచ్ ని ఈ ఐటెం సాంగ్ కి ఎంపిక చేసుకున్నారు. గతంలో తమిళ బిల్లా చిత్రంలో హజేల్ కీచ్ చిన్న పాత్రలో మరియు హిందీ బాడి గార్డ్ చిత్రలో కనిపించింది. ఈ పాట చాలా బాగా వచ్చినట్టు తెలుస్తుంది.

సోను సూద్ ఈ చిత్రం కొద్ది రోజుల్లో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తుంది అంటున్నారు. ” ఇప్పుడే నిర్మాత స్నేహితుడికి మాగ్జిమం చిత్రం లో “ఆ అంటే” పాటను చూపించాము అతను డివిడి వెనక్కు ఇవ్వటానికి ససేమిరా అన్నారు. ఈ పాట భారీ విజయం సాదిస్తుందని అతను పందెం కాసాడు. ఈ పాట చుసిన ఎవరయినా ఈ పాట గురించి మాట్లాడకుండా ఉండలేరు కొద్ది రోజుల్లో ఈ పాట టీవీ చానల్స్ లో ప్రసారం కాబోతుంది. చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నాను. ఇదంతా దేవి శ్రీ మరియు హజేల్ కీచ్ ల వల్లే సాధ్యమయ్యింది” అని ట్విట్టర్ లో అన్నారు. ఈ పాట విజయం సాదిస్తే దేవి శ్రీ ప్రసాద్ హిందీలో తన కెరీర్ ని మొదలు పెట్టేయచ్చు. గతం లో ఆర్య-2 లో “రింగ రింగా” పాట హిందీ “రెడీ” చిత్రం లో “దింక చిక” అని భారీ విజయం సాదించింది.

తాజా వార్తలు