సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ అంటేనే ఎనర్జీ.. మొదటి సినిమా నుండి తనకంటూ ఓ పత్యేకమైన బాణిని సృష్టించుకుని సౌత్ లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే, ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ కే ఏకైక సంగీత సంచలనంగా ఒక వెలుగు వెలిగిన దేవి, గత కొన్ని సినిమాలుగా మాత్రం తన స్థాయిలో అంతగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడని విమర్శలను ఎదురుకున్నాడు. అంతమాత్రాన దేవి టాలెంట్ ను తక్కువ చేయలేం. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కు దేవి అందించిన సాంగ్స్ మాస్ లో ఒక ఊపు ఊపాయి. కాకపోతే తమన్ బుట్టబొమ్మ ప్రవాహంలో ఆ సినిమాలో దేవి సాంగ్స్ కు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
కాగా ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాకి పని చేస్తున్నాడు. అయితే, పుష్ప మ్యూజిక్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందట. దేవి ఈ సారి సాంగ్స్ తో అదరగొట్టేశాడట, ఇప్పటికే పుష్ప ఆల్బమ్ లోని సాంగ్స్ మొత్తాన్ని పూర్తి చేశాడని, సాంగ్స్ అన్నీ ఆల్ టైం హిట్స్ గా నిలిచిపోయేలా ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక దేవి – సుకుమార్ – బన్నీ కాంబినేషన్ అంటే ఐటమ్ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో వీరి కలయికలో
వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ సారి రాబోయే సాంగ్ ఇక ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.