ఒక్కడు రీమేక్ లో సోనాక్షి సిన్హా

ఒక్కడు రీమేక్ లో సోనాక్షి సిన్హా

Published on Nov 19, 2013 8:00 PM IST

sonakshi-sinha

చాలా కాలం విరామం తరువాత మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా రిమేక్ మళ్లీ మొదలైంది. ఇదివరకు ఈ సినిమా హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకుని అతని తనయుడు అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిద్దాం అనుకున్నాడు

అయితే ఇప్పుడు బోనీ కపూర్, అర్జున్ కోసం ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. ఆమె నటించిన ‘లూటేరా’ మరియు ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దుబారా’ సినిమాలు విజయం సాధించకపోయినా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. సోనాక్షి త్వరలో బుల్లెట్ రాజా మరియు రాంబో రాజ్ కుమార్ సినిమాలలో కనిపించనుంది

ఈ ‘ఒక్కడు’ రిమేక్ ను తెరకెక్కించే పనిని ఇటీవలే గూగుల్ రీ యూనియన్ అనే వీడియో ను తీసిన అమిత్ శర్మ చేతిలో పెట్టాడు. ఇది అతని మొదటి సినిమా. సమాచారం ప్రకారం ఈ యాడ్ ఇంటర్నెట్ లో హల చల్ చేసే ముందే ఈ సినిమాకోసం సంప్రదించారట. ఈ సినిమా వచ్చే యేడు మొదలుకానుంది

తాజా వార్తలు