‘ది ప్యారడైస్’ నుంచి సాలిడ్ ట్రీట్.. ఎప్పుడంటే..?

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 27న ఉదయం 10.08 గంటలకు మరియు సాయంత్రం 5.04 గంటలకు ఈ అప్డేట్ ఉండబోతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. అయితే, ఇది ఈ సినిమాలో విలన్‌గా నటించబోయేది ఎవరనే అప్డేట్ అయ్యి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాని సరికొత్త గెటప్‌తో కనిపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version