‘కూలీ’ నుంచి ఓ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ

‘కూలీ’ నుంచి ఓ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ

Published on Jul 25, 2025 10:00 PM IST

COOLIE Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కూలీ’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఆగస్టు 2న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ ఈవెంట్‌లో ఓ సాలిడ్ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

దీంతో ఈ విజువల్ ట్రీట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు