పవన్ – క్రిష్ ల కాంబో..ఈ ఫ్యాక్టర్ పై భారీ అంచనాలు.!

పవన్ – క్రిష్ ల కాంబో..ఈ ఫ్యాక్టర్ పై భారీ అంచనాలు.!

Published on Sep 9, 2020 11:08 AM IST

ఇప్పుడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న నటిస్తున్న చిత్రాల్లో పవన్ అభిమానులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో తీస్తున్న తన 27వ చిత్రమే అని చెప్పాలి. ఎందుకో ఈ సినిమాపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

బహుశా ఇది ఒక స్ట్రైట్ సినిమా అనే కాకుండా ఇప్పటి వరకు పవన్ టచ్ చెయ్యని ఒక పీరియాడిక్ జానర్ కనుక ఆ రకంగా కూడా వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమాకు మేజర్ ఎస్సెట్ విజువల్ ఎఫెక్ట్స్. దీనికి సంబంధించి కూడా ఇపుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ కు హాలీవుడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

దీనితో ఈ ఫ్యాక్టర్ పై కూడా వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే క్రిష్ కూడా అందుకు తగ్గట్టుగానే బెటర్ అవుట్ ఫుట్ నే ఇచ్చే పనిలో ఉన్నారని చెప్పాలి. ఇంతకు మునుపే నందమూరి నటసింహం బాలయ్యతో తీసిన “గౌతమీ పుత్ర శాతకర్ణి”లో విజువల్స్ అతి తక్కువ సమయంలో అందులోని తక్కువ బడ్జెట్ తోనే రాబట్టారు. సో పవన్ తో సినిమాకు కూడా అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా తియ్యడం గ్యారంటీ అని చెప్పాలి.

తాజా వార్తలు