మే 30న మొదలుకానున్న శిరీష్, రెజీనాల సినిమా

మే 30న మొదలుకానున్న శిరీష్, రెజీనాల సినిమా

Published on May 29, 2013 12:17 AM IST

allu-sirish--Regina

‘గౌరవం’ వంటి సందేశాత్మక సినిమా తరువాత అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ సినిమా చెయ్యనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘కొత్త జంట’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ‘ఎస్. ఎం.ఎస్’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలలో నటించిన రెజీనా ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన కనిపించనుంది. ఈ సినిమా ఇదివరకే మొదలైనా కొన్ని కారణాల వల్ల వాయిదాపడింది. కాబట్టి ఇప్పుడు మే 30న భారీ రీతిలో మే 30న లాంచనంగా మొదలుకానుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరుకానున్నారు. మారుతి మాట్లాడుతూ “శిరీష్ నాకు చాలా కాలంగా తెలుసు. అతనికి ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ టైమింగ్ వుంది. అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో తన పాత్రను రూపుదిద్దాము. ‘కొత్త జంట’ సినిమా ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్”అని తెలిపాడు. జె.బి సంగీతం అందిస్తున్నాడు. ‘స్వామి రారా ‘ సినిమాకు పనిచేసిన రిచార్డ్ ప్రసాద్ ఏ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు