ఇన్ని రోజులు సింగర్ గా, అప్పుడప్పుడు కొంతమందికి డబ్బింగ్ చెబుతూ మంచి పేరు తెచ్చుకున్న సింగర్ సునీత త్వరలో తెలుగు సినిమాలో కనిపించనుంది. ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇప్పటి వరకూ కేవలం టీవీలలో మాత్రమే కనిపించింది. కానీ ఈ సారి రూటు మార్చి శేఖర్ కమ్ముల చేసిన ‘అనామిక’ సినిమాలో కనిపించనుంది.
శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ వీడియో ని ప్లాన్ చేస్తున్నారు. సునీత ఈ వీడియోలో కనిపించనున్నారు. ‘అనామిక’ సినిమా ఫిబ్రవరి 27న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. నయనతార, వైభవ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.