బాద్షా కోసం పాట పాడిన శింబు.!

Simbhu

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా రిలీజ్ కి దగ్గరవుతున్న కొద్దీ ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ స్విట్జర్ ల్యాండ్ లో ఎన్ టి ఆర్ – కాజల్ పై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోని మార్చ్ 10న రిలీజ్ చెయ్యనున్నారు.

ఇలాంటి తరుణంలో ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ఓ ఆసక్తి కరమైన విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు ఓ పాటని పాడారు. సినిమాలో పెప్పీగా సాగే ‘డైమండ్ గర్ల్’ అనే పాటని శింబు పాడారు, అలాగే ఈ పాట బాగా వచ్చినందుకు థమన్ సంతోషంగా ఉన్నాడు. కామెడీ కలగలిపిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీను వైట్ల తో కలిసి కోనా వెంకట్, గోపీ మోహన్ కథా సహకారం అందించారు. ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చెస్తున్నారు.

Exit mobile version