బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో పాట పాడనున్న శింభు, అనిరుధ్

బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో పాట పాడనున్న శింభు, అనిరుధ్

Published on Dec 24, 2012 8:10 PM IST

Backbench-Student

మధుర శ్రీదర్ రాబోతున్న చిత్రం “బ్యాక్ బెంచ్ స్టూడెంట్”లో “గీతాంజలి” చిత్రంలోని “జగడ జగడ” అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఇళయరాజా స్వరపరచిన ఈ పాట అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. ఈ రీమిక్స్ ని మంచి గాయకుడి చేత పాడించాలని మధుర శ్రీధర్ అనుకున్నారు అందుకు గాను ఈ చిత్ర హీరో ప్రముఖ తమిళ హీరో శింభు చేత పాడిద్దామని సలహా ఇచ్చారు. ఈ చిత్ర హీరో మహాత్ కి శింభు మంచి స్నేహితుడు కావడంతో వెంటనే శింభు ఒప్పుకున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో టైటిల్ ట్రాక్ ని పాడించడానికి మహాత్, అనిరుధ్ రవిచందర్ (కొలవేరి ఫేం) ని ఒప్పించారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో మహాత్ సరసన పియా బాజ్పాయ్ మరియు అర్చన కవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం వీ కె రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు