దక్షిణాదిలో జరిగే అవార్డుల ప్రధానోత్సవం అన్నిటిలో సౌత్ ఇండియన్ ఇంటర్నాషనల్ మూవీ (సైమా)అవార్డ్స్ ప్రముఖ తారలనడుమ అత్యంత ఘనంగా జరిగే వేడుక.ఈ యేడాది కూడా ఈ అవార్డుల వేడుక దుబాయ్ లో భారీ రీతిలో జరగనుంది. దీనికోసం కావల్సిన ఏర్పాటులను దుబాయ్ లో ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు.ఈ నెల 12 మరియు 13వ తేదీలలో షార్జా ఎక్స్పో సెంటర్ ఈ వేడుకకు వేదికకానుంది.
ఈ యేడాది మనముందుకు ఈ వేడుక మరిన్ని ప్రత్యేకతలతో రానుంది. మొదటిసారిగా రానా, శ్రియ, ఆర్య మరియు సోనూ సూద్ లు కలిసి ఈ వేడుకకు ప్రాతినిద్యం హించనున్నారు.శృతిహాసన్, హన్సిక, శ్రేయ, రెజీనా మరికొంతమంది భామలు నృత్యప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీరేకాక ఉషా ఉతుప్, అనిరుధ్ మరియు ఆండ్రియా తమ గళాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు.