‘ఇట్స్ కాంప్లికేటెడ్’ సినిమాతో ఆడియన్స్ ఎక్సయిట్ అవుతారు – సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కృష్ణ అండ్ హిస్ లీల’ 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’గా మార్చారు. ఈ కొత్త టైటిల్, ప్రమోషన్స్ మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నాకు సిద్దు, రవికాంత్ తో మరో సినిమా చేయాలని ఉండేది. ఇది రిలీజ్ చేస్తే గాని మరో సినిమా చేయనని అన్నారు. దీనికి ఫిబ్రవరి 14 రైట్ డేట్. ఇది రీ రిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్’ అన్నారు.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చూడాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని ఉంది’ అన్నారు

డైరెక్టర్ రవికాంత్ పెరెపు మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ సినిమా థియేటర్స్ లో చూడటం కుదరలేదు. అందరితో కలిసి చూస్తే మజా వస్తుంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం.’ అన్నారు

Exit mobile version