దాదాపుగా పూర్తి అయిన సిద్దార్థ్ – సమంతల చిత్రం

దాదాపుగా పూర్తి అయిన సిద్దార్థ్ – సమంతల చిత్రం

Published on Oct 5, 2012 12:30 PM IST


సిద్దార్థ్ మరియు సమంతలు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం దాదాపుగా పూర్తి కావొచ్చింది ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం ఇప్పటికే చిత్రీకరించేసారు. ఈ మధ్యనే సిద్దార్థ్ మీద కవ్వాలి పాటను తెరకెక్కించారు. చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం మలేసియా పయనం అవనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సమంత ముస్లిం అమ్మాయిగా కనిపించనుంది. నిత్య మీనన్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. “అల మొదలయింది” చిత్రం తరువాత నందిని రెడ్డు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది ఈ చిత్రం కోసం నందిని రెడ్డి చాలా కష్టపడ్డారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు