‘3BHK’ అంటూ మిడిల్ క్లాస్ కథతో వస్తున్న సిద్ధార్థ్

‘3BHK’ అంటూ మిడిల్ క్లాస్ కథతో వస్తున్న సిద్ధార్థ్

Published on Feb 5, 2025 7:00 PM IST

హీరో సిద్ధార్థ్ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక సిద్ధార్థ్ నటించే సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఆయన నటిస్తున్న తాజా చిత్రాన్ని శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ చిత్రానికి ‘3BHK’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే విషయాలు మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. సాధారణ గుమాస్తా అయిన ఓ తండ్రి, ఇంట్లో అందరి పనులు చూసుకునే తల్లి.. వారికి ఓ కొడుకు, కూతురు.. వారి కల.. అనే నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు ఈ టైటిల్ టీజర్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు