చష్మే బద్దూర్ ట్రైలర్ కి వస్తున్న స్పందన చూసి థ్రిల్ ఫీలవుతున్న సిద్ధార్థ్

చష్మే బద్దూర్ ట్రైలర్ కి వస్తున్న స్పందన చూసి థ్రిల్ ఫీలవుతున్న సిద్ధార్థ్

Published on Feb 9, 2013 4:55 PM IST

Siddharth
1981లో వచ్చిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా చష్మే బద్దూర్ ని ఇప్పుడు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోలలో సిద్ధార్థ్ ఒకడిగా నటిస్తున్నాడు. తాప్సీ హీరోయిన్ గా నటిస్తుండగా అలీ జాఫర్, దైవేందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి వస్తున్న స్పందన చూసి సిద్ధార్థ్ థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నాడు. సాజిద్ వాజిద్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. సిద్ధార్థ్, తాప్సీ ఇద్దరికీ సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ కావడంతో ఈ సినిమాని ఇక్కడ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు