‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు

‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు

Published on Sep 13, 2025 4:07 PM IST

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. ఎనలేని హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ఒకో అప్డేట్ తో బయటకి వస్తుంది. కానీ అనూహ్యంగా షూటింగ్ కోసం ఒక అప్డేట్ ఇపుడు బయటకి వచ్చింది. మేకర్స్ ఇది వరకే షూటింగ్ ఎప్పుడో పూర్తయినట్టు చెప్పారు.

కానీ ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరా మెన్ రవి కే చంద్రన్ ‘ఓజి’ షూట్ లో ఇదే చివరి రోజు అంటూ సుజీత్ తో కలిసి ఉన్న పిక్ ని లేటెస్ట్ గా చేసిన పోస్ట్ ట్విస్ట్ గా మారింది. దీనితో రిలీజ్ కి కేవలం ఇంకొన్ని రోజులే ఉన్నప్పటికీ ఇంకా షూట్ లో ఉన్నారా అంటూ ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. అయితే ఇదంతా ప్రమోషనల్ కంటెంట్ కి సంబంధించిన షూటింగ్ కూడా కావచ్చని మరికొందరు అంటున్నారు. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు