ఇండియన్ సినీ రంగంలో ఎప్పటికప్పుడు తన సినిమాలతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న దర్శకుడు శ్యాం బెనెగల్. అతను ఈ సంవత్సరం ప్రఖ్యాత ఎ.ఎన్.ఆర్ నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు. శ్యాం బెనెగల్ తీసిన అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక మరియు మండి సినిమాలకు ఎన్నో అవార్డులని గెలుచుకున్నారు. అలాగే ఆయన పద్మ శ్రీ, పద్మ భూషణ్ లాంటి బిరుదులని కూడా అందుకున్నాడు. 2005లో దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. ఆయన తెలుగులో వాణీ శ్రీ ప్రధాన పాత్రలో నటించిన ‘అనుగ్రహం’ సినిమాని తీసారు.
ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అక్కినేని నాగేశ్వర రావు, టి. సుబ్బరామి రెడ్డి ఈ సంవత్సరం ఎ.ఎన్.ఆర్ నేషనల్ అవార్డుని శ్యాం బెనెగల్ కి ఇవ్వనున్నామని తెలియజేసారు. ఈ అవార్డు కార్యక్రమం జనవరి 27న హైదరాబాద్లో జరగనుంది. ఇండియన్ సినీ రంగం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి ఈ అవార్డుని 2005లో స్థాపించిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు అందజేస్తున్నారు. గతంలో హేమమాలిని,బాలచందర్, వైజయంతి మాల, దేవ్ ఆనంద్, లతా మంగేష్కర్ లు ఈ అవార్డు ను అందుకున్నారు