ఎన్.టి.ఆర్ సినిమా కోసం సమంతతో జత కలిసిన శృతి హాసన్

ఎన్.టి.ఆర్ సినిమా కోసం సమంతతో జత కలిసిన శృతి హాసన్

Published on Feb 5, 2013 2:55 PM IST

NTR-Samantha-Shruthi-Hassan
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా రానున్న చిత్రం కోసం శృతి హాసన్ సమంతతో జత కలిసింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మొదట ఈ సినిమా సెకండ్ హీరోయిన్ కోసం పలువురిని పరిశీలించారు చివరిగా శృతి హాసన్ ఎంటర్ అయ్యింది. ఈ వార్తని తనే స్వయంగా ట్విట్టర్లో తెలిపింది. ‘ ‘చివరికి తారక్ సినిమాలో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే నా మీద నమ్మకం ఉంచినందుకు హరీష్ శంకర్ కి థాంక్స్’ అని ట్వీట్ చేసింది.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఫుల్ చార్జ్ మీదున్న హరీష్ శంకర్ ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని సరికొత్త అవతారంలో చూపించనున్నాడు.

తాజా వార్తలు