“గబ్బర్ సింగ్” చిత్రంలో శృతి తన ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది : హరీష్ శంకర్

“గబ్బర్ సింగ్” చిత్రంలో శృతి తన ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది : హరీష్ శంకర్

Published on Apr 14, 2012 10:09 PM IST


దర్శకుడు హరీష్ శంకర్ “గబ్బర్ సింగ్” చిత్రంలో నటి శృతి హాసన్ నటన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. పల్లెటూరి అమ్మాయి భాగ్యలక్ష్మిగా ఈ చిత్రంలో శృతి హాసన్ కనిపించబోతుంది. గబ్బర్ సింగ్ చిత్రంలో శృతి హాసన్ చాలా విబిన్నంగా కనిపించనున్నారు. ఈ చిత్రం మీద శృతి హాసన్ చాలా నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో మొదటి సారి ఈ భామ కలిసి నటిస్తున్నారు. ” భాగ్య లక్ష్మి పాత్రలో శృతి హాసన్ అద్బుతంగా నటిస్తున్నారు తన ఉత్తమ ప్రదర్శనను ఇచ్చినందుకు ఆమెకు నా కృతజ్ఞతలు ” అని హరీష్ శంకర్ ట్విట్టర్ లో తెలిపారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం కొన్ని పాటలు చిత్రీకరణ జరుపుకోవలసి ఉంది. రేపు ఈ చిత్ర ఆడియో వేడుక శిల్ప కళా వేదికలో ఘనంగా జరగనుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తాజా వార్తలు