పవన్ హీరోగా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ హిందీ హిట్ మూవీ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో లాయర్ రోల్ చేస్తున్నారు. విమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..నేడు ఉమెన్స్ డే సంధర్భంగా ఈ చిత్రం నుండి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కాగా కథ ప్రకారం పవన్ భార్య పాత్ర కొరకు ఓ క్యామియో ఎంట్రీకి ఆస్కారం ఉంది.
ఈ పాత్ర ఎవరు చేస్తారు అనేది మొదటి నుండి హాట్ టాపిక్ గా ఉంది. ఐతే వకీల్ సాబ్ లో పవన్ భార్య పాత్ర శృతి హాసన్ చేసే అవకాశం కలదు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆమె మాట్లాడడం, ఒప్పుకోవడం జరిగిందని తెలుస్తుంది. కథ రీత్యా ఈ పాత్రకు కొంచెం స్క్రీన్ స్పేస్ మాత్రమే ఉంటుంది. ఇక పింక్ రీమేక్ తమిళంలో అజిత్ కుమార్ చేయగా అక్కడ ఆయన భార్య పాత్ర విద్యాబాలన్ చేశారు.