బెంగాలీలో భారీ ఆఫర్ చేజిక్కించుకున్న శ్రద్ధాదాస్

బెంగాలీలో భారీ ఆఫర్ చేజిక్కించుకున్న శ్రద్ధాదాస్

Published on May 24, 2013 7:00 PM IST

Shraddha-Das
శ్రద్ధాదాస్ ఈ మధ్య పలు ప్రదేశాలలో కనిపిస్తుంది. బాలీవుడ్లో మూడు సినిమాలను అంగీకరించిన ఆమె ఇప్పుడు ఒక బెంగాలీ సినిమా కూడా ఒప్పుకుందట. ఈ సినిమా గురించిన విషయాలు ఏమి చెప్పకపోయినా బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సరసన నటించడానికి రంగం సిద్ధంచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో మొదలైంది. శ్రద్ధాదాస్ ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతానని ట్విట్టర్లో తెలిపింది.

గత ఏడాది ‘డ్రాకులా 3డి’ అనే సినిమాలో నటించిన ఆమె, ఆ చిత్రం పలు భాషలలో విడుదలైనా పరజాయం పాలయింది. చాలా కాలం విరామం తరువాత ఆమె వై.వి.ఎస్ చౌదరి తీస్తున్న ‘రేయ్’ సినిమాలో మెక్సికన్ పాప్ పాపగా కనిపిస్తుంది. ఇప్పటివరకూ తాను నటించిన సినిమాలన్నింటిలో ఇదే గ్లామర్ గా కనిపించే సినిమా అంట. సాయి ధరంతేజ్, సయామి ఖేర్ మరియు శ్రద్ధాదాస్ నటిస్తున్న ఈ సినిమా ఈ వేసవి చివర్లో విడుదలకానుంది.

తాజా వార్తలు