సాంగ్ కోసం శ్రీశైలంలో ‘పుష్ప’ !

సాంగ్ కోసం శ్రీశైలంలో ‘పుష్ప’ !

Published on Jan 31, 2021 6:38 PM IST


సెన్సేషనల్‌ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చేస్తోన్న చిత్రం ‘పుష్ప’. కాగా ఇటివలే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే పిబ్రవరి 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు.. ఈ సాంగ్ మొత్తం శ్రీశైలంలో షూట్ చేయబోతునట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ మొత్తం అడవి నేపథ్యంలో ఉంటుందట. అందుకే సుకుమార్ ఈ సాంగ్ మొత్తాన్ని శ్రీశైలంలోనే తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.

కాగా మారేడుమిల్లి అడవుల్లో షూట్ ప్రస్తుతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు