ప్రైడ్ ఇండియన్ సినిమా “బాహుబలి” సిరీస్ ఇప్పుడు రెండు భాగాలూ కలిసి ఒక్క భాగంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ లైఫ్ టైం చిత్రం విడుదల అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మరింత హైప్ సెట్టయ్యింది. అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ వచ్చిందో లేదో అప్పుడే బుక్ మై షోలో ఏదో కొత్త సినిమా మాదిరిగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసింది.
దీనికి ముందే అనౌన్స్ అయ్యిన బాలీవుడ్ భారీ చిత్రం రామాయణ ఇంట్రెస్ట్స్ ని సైతం బాహుబలి ది ఎపిక్ ఇప్పుడు క్రాస్ చేయడం అనేది ఊహించని అంశం. అంటే ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఏ లెవెల్లో ఎదురు చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి మాత్రం బాహుబలి ది ఎపిక్ ర్యాంపేజ్ కూడా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పి తీరాలి. ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 31 వరకు ఆగాల్సిందే.