డిసెంబర్ 2న రానున్న శత్రువు ఆడియో?

డిసెంబర్ 2న రానున్న శత్రువు ఆడియో?

Published on Nov 22, 2012 8:08 PM IST


శ్రీకాంత్ మరియు అక్ష త్వరలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్లో కనిపించనున్నారు. “శత్రువు” అనే పేరుతో రానున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 2న విడుదల కానుంది. ఎం ఎస్ ఆర్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా వి ఎస్ రామిరెడ్డి నిర్మించారు. గుణ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో చాలా భాగం హైదరాబాద్లో చిత్రీకరించారు కొద్ది వారాల క్రితం పట్టాయలో రెండు పాటలను చిత్రీకరించారు. అక్ష ఈ చిత్రంలో ముస్లిం యువతీ పాత్రలో కనిపించనున్నారు. “శత్రువు” చిత్రం కాకుండా అక్ష “ఈరోజుల్లో” ఫేం శ్రీనివాస్ సరసన “రయ్ రయ్” అనే చిత్రంలో కనిపించనున్నారు. శ్రీకాంత్ నటించిన “దేవరాయ” చిత్రం నవంబర్ 23న విడుదల కానుంది.

తాజా వార్తలు