శ్రీకాంత్ మరియు అక్ష ప్రధాన పాత్రలలో “శత్రువు” అనే చిత్రం రానుంది. ఈ చిత్రాన్ని వి ఎస్ రామి రెడ్డి నిర్మించగా ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ మాట్లాడుతూ ” డబ్బు కోసం ఏమైనా చేసే పాత్రా నాది ఇందులో సెంటిమెంట్ మరియు ఎంటర్ టైన్మెంట్ సమపాళ్ళలో ఉంటాయి ఈ చిత్ర నిర్మాతలు స్టువర్ట్ పురం దొంగలు తరువాత చేస్తున్న చిత్రం ఇదే” అని అన్నారు. అనుకున్న బడ్జెట్ లో నే చిత్రాన్ని పూర్తి చేసినట్టు నిర్మాత తెలుపగా ఈ చిత్రం కాన్సెప్ట్ మీద ఆధారపడి చేసిన చిత్రం అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి గుణ సంగీతం అందించారు.