సినిమా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, ప్రేక్షకులు థియేటర్లకు ఎలాంటి ఇబ్బంది ఫీలవకుండా వస్తుండటంతో హీరోలంతా తమ సినిమాలతో రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోల నుండి డెబ్యూ హీరోల వరకు అందరూ సినిమా విడుదల తేదీలను ఫైనల్ చేసుకుని వరుస అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అంటూ తెగ హడావుడి చేసేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు మూడు సినిమాల టీజర్లు వస్తున్నాయి.
దీంతో హీరో శర్వానంద్ సైతం తన ‘శ్రీకారం’ సినిమాతో సిద్ధమయ్యారు. ఈ సినిమా టీజర్ రెడీ చేసుకుంటున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. శర్వాకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ‘శ్రీకారం’ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరోసారి ‘శతమానంభవతి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆశిస్తున్నారు. కొన్నాళ్ళుగా వరుస పరాజయాలు చవిచూసిన శర్వా సైతం ఈ ప్రాజెక్ట్ మీద గట్టిగా హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. మీక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.