శర్వానంద్ తన దిన శైలిలో సరికొత్త పంథాలో సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకూ తను చేసిన వాటిలో కమర్షియల్ మరియు మాస్ ఎంటర్టైనర్ సినిమాలు తక్కువే. అతను నమ్మిన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. శర్వా ఎప్పుడో ఓ సారి బయటకొచ్చి ‘నువ్వా నేనా’ లాంటి సినిమా చేస్తున్నాడు. అది కాకుండా అతను చేసిన ‘అమ్మ చెప్పింది’, ‘గమ్యం’, ‘అందరి బంధువయ’ సినిమాలు పూర్తి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు. ‘ప్రస్థానం’ సినిమాలో అతను చేసిన రోల్ చూసి అందరూ స్టన్ అయిపోయారు. ఇటీవలే ఓ పత్రికతో ముచ్చటించినపుడు ‘నాకు అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమే చాలా ఇష్టం. ఇంకా ముందు ముందు కూడా అలాంటి సినిమాలు చేస్తానని’ శర్వా అన్నాడు.
ప్రస్తుతం శర్వానంద్ అనిష్ కురువిల్ల డైరెక్షన్లో ‘కో అంటే కోటి’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ – ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర తను తీసే సినిమాల కలెక్షన్స్ ని బట్టే గుర్తింపు ఉంటుంది. అరుదైన సినిమాలు తీసే శర్వా నిజంగానే ఒక క్లాస్ హీరో. ప్రస్తుతం తను చేస్తున్న’కో అంటే కోటి’ సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.