శంకర్ తాజా సినిమా మనోహరుడు జూన్ కు వాయిదాపడింది. ముందుగా ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ నిర్మాణాంతర కార్యక్రమాల వలన జాప్యం జరగచ్చని శంకర్ భావిస్తున్నాడు. విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్స్. ఉపేన్ పాటేల్ ముఖ్య పాత్రధారి
కొడైకనాల్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరికి షెడ్యూల్ ని పూర్తిచేసుకోనుంది. మార్చ్ నుండి ఒక పాటను తీసి షూటింగ్ ను ముగించనున్నారు. విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసినా శంకర్ స్టోరీ లైన్ చెప్పడం లేదు
రెహమాన్ స్వరాలను, పి.సి శ్రీరామ్ తన కెమెరా ప్రతిభను మనకు అందించనున్నారు. తెలుగు, తమిళ భాషలలొ విడుదలకానున్న ఈ సినిమాను ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నాడు