శంకర్ రాబోతున్న చిత్రం “మనోహరుడు” వీనులవిందుగా ఉండబోతుంది. విక్రం మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. చెన్నైలో పొడవయిన షెడ్యూల్ చిత్రీకరణ తరువాత ప్రస్తుతం చిత్ర బృందం చైనా వెళ్ళింది. చైనాలో అద్భుతమయిన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నట్టు నటి ఏమి జాక్సన్ వెల్లడించింది. శంకర్ చిత్రాలలో అద్భుతమయిన ప్రదేశాలను చూపించడం కొత్తేమీ కాదు ఈ చిత్రంలో చైనాలోని అందమయిన ప్రదేశాలను చూపించనున్నారు. క్రౌచింగ్ టైగర్ మరియు హిడన్ డ్రాగన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రదేశాలలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు పిసి శ్రీరాం ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.