“బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది” చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల‌ చేసిన ప్ర‌గ్యాజైస్వాల్

“బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది” చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల‌ చేసిన ప్ర‌గ్యాజైస్వాల్

Published on Dec 2, 2020 12:00 PM IST

మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ణిదీప్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో ప్ర‌ముఖ కామెడీ హీరో ష‌క‌ల‌క్ శంక‌ర్ లీడ్ రోల్ లో రూపొందుతున్న రొమాంటిక్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది. నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్ తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వ‌ర్గాల ఎటెన్ష‌న్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ త‌రువాత రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్స్ తో కూడా అనూహ్య స్పంద‌న అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో యూనిట్ స‌భ్యులు తాజాగా టీజ‌ర్ సిద్ధం చేశారు.

ప్ర‌‌ముఖ స్టార్ హీరోయిన్, హ్యాపెనింగ్ బ్యూటీ ప్ర‌గ్యాజైస్వాల్ ఈ టీజ‌ర్ ని విడుద‌ల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని నిర్మాతలు లుకాలపు మధు, సోమేశ్ ముచ‌ర్ల తెలిపారు. ష‌క‌ల‌క శంక‌ర్ మార్క్ కామెడీతో పాటు యూత్ ని ఆక‌ట్టుకునే అన్ని అంశాల‌తో ఈ సినిమాను అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించే రీతిన రూపొందిస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు కుమార్ కోట తెలిపారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హార‌ర్ కామెడీ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నట్లుగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌క‌టించారు

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు