వెంకటేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ‘షాడో’ రూపుదిద్దుకుంటుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ చాలా కాలం తర్వాత ఒక యాక్షన్ రోల్ లో కనపడనున్నారు. వెంకటేష్ కొత్త స్టైల్ ఇప్పటికే ఇంటర్నెట్లో అలజడి సృష్టిస్తుంది. ఈ చిత్రం ఆడియో మార్చి 7న విడుదల కావల్సివుంది కాని హంగామా ఈ ఆడియో హక్కుల్ని కొనుకున్న తర్వాత ఆడియో రిలీజ్ వేరే తారీఖుకి మార్చబడింది. ఇప్పుడు మెహర్ రమేష్ ఆడియో కంపెనీ తో కలిసి చిత్ర టైటిల్ సాంగ్ ని మార్చి 7నే ఇంటర్నెట్ ద్వారా విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ పాటని బాబా సైగల్ పాడారు. ఈ పాట రూపుధిధుకున్న తీరుతో చిత్ర బృందం మొత్తం చాలా ఆనందంగా వుంది .
‘షాడో’ చిత్రం లో వెంకటేష్,తాప్సీ ముఖ్యపాత్రధారులు. శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనపడనున్నారు. ఈ చిత్రంలోని చాలా భాగం హైదరాబాద్, మలేషియా, యూరోప్ లలో చిత్రీకరించారు. ఈ చిత్రం ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మిగిలిన పాట ని మార్చి 9 నుంచి హైదరాబాద్లో చిత్రీకరించనున్నారు. ఇటివలే నిర్మానంతరపు పనుల్ని ప్రారంభించుకున్న ఈ చిత్రం డి. టి . ఎస్ మిక్సింగ్ ప్రసాద్ లాబ్స్ హైదరాబాద్లో ప్రారంభమైంది . ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి శివరాం ప్రసాద్ నిర్మిస్తున్నారు .