నవంబర్ 20 నుండి మొదలుకానున్న షాడో మరో షెడ్యూల్

నవంబర్ 20 నుండి మొదలుకానున్న షాడో మరో షెడ్యూల్

Published on Nov 17, 2012 4:00 AM IST

వెంకటేష్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలలో రానున్న “షాడో” తరువాతి షెడ్యూల్ హైదరాబాద్లో నవంబర్ 20 నుండి ప్రారంభం కానుంది.కొన్ని సన్నివేశాలు, ఐటం సాంగ్ మరియు క్లైమాక్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారని మెహర్ రమేష్ తెలిపారు. 2013 సంక్రాంతి పరుగు నుండి ఈ చిత్రం తప్పుకున్నాక చిత్ర కార్యక్రమాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా మెహర్ రమేష్ మొదలుపెట్టారు. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ ఈ చిత్రానికి కథ అందించారు.

తాజా వార్తలు