వెంకటేష్, తాప్సీ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘షాడో’ కొత్త ట్రైలర్ ధియేటర్ లలో హంగామా చేస్తుంది. 1 నిమిషం 14 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్ ఎంపిక చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడుతున్న కొన్ని ధియేటర్లలో ప్రదర్శిస్తుండగా వెంకటేష్ ఫాన్స్ నుండి రెస్పాన్స్ బావుందని దర్శకుడు మెహెర్ రమేష్ అంటున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా క్లైమాక్స్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. మెహెర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న షాడో ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.