వర్మ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.!

వర్మ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.!

Published on Feb 5, 2021 7:02 AM IST

ఎప్పుడూ తన సినిమాలతో సంచలనం రేపే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో కూడా ఎక్కడా ఆగలేదు. అప్పుడు తీసినవి కూడా వివాదాత్మక చిత్రాలే కావడంతో కాస్త గట్టిగానే స్ట్రోక్ ను కూడా అందుకున్నాడు. అయినప్పటికీ తన రూట్ తెలిసిందే కదా కొన్ని సున్నితమైన అంశాల మీద కూడా పడ్డాడు వర్మ. అలా కొన్ని సంచలన సంఘటనలు అయినటువంటి కొన్నింటిపై సినిమాలు చేసాడు. మరి అలా చేసిన ఓ సినిమానే “దిషా ఎన్కౌంటర్”.

ఈ సినిమా ఏ ఘటన ఆధారంగా తీసారో తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే బాధిత కుటుంబం వర్మ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా వర్మ తన పంథా తనదే అన్నట్టుగా పోస్టర్లు విడుదల తేదీలు ప్రకటించుకున్నాడు. కానీ ఫైనల్ గా మాత్రం వర్మ సినిమాకు సెన్సార్ బోర్డు వారు షాకిచ్చారు. ఈ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్టిఫై చెయ్యమని తేల్చి చెప్పేసారట. దీనితో వర్మ సినిమా థియేట్రికల్ రిలీజ్ పక్కకి పోయినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు