‘లూసిఫర్’ స్క్రిప్ట్ కోసం సీనియర్ రైటర్ !

మెగాస్టార్ చిరంజీవి వినాయక్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ లో వినాయక్ తో పాటు ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా కూడా గత కొన్ని రోజులుగా మార్పులు చేర్పులు చేస్తూ.. ముమ్మరంగా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. వీరంతా ఇప్పటికే ఒక వెర్షన్ ను పూర్తి చేశారట. ఆ వెర్షన్ ను చూసి దానిలోని లోటుపాట్లును వివరించడానికి సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపాలకృష్ణ స్క్రిప్ట్ ను చెక్ చేస్తోన్నాడట. తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్లు కూడా ఇప్పటికే ఆయన చెప్పాడట.

కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని వినాయక్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట. ప్లాప్స్ లో ఉన్న వినాయక్ ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రాతో పాటు ఆకుల శివ కూడా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారు. ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందట.

Exit mobile version