సున్నితమైన సినిమాలు చేసే శేఖర్ కమ్ముల తన రాబోయే సినిమా ‘అనామిక’ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోంది. తన భర్తని ఎతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన యువతి పాత్రలో నయనతార కనిపించనుంది. హర్షవర్ధన్ రాణే, వైభవ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా హిందీలో వచ్చిన కహానీ సినిమాకి రీమేక్. ఈ మూవీలో విద్యా బాలన్ ప్రెగ్నెన్సీ లేడీలా కనిపించింది. కానీ ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ చూసిన చాలా మంది నయనతార ప్రెగ్నెంట్ కాదని చూసి షాక్ అయ్యారు. ఈ విషయంపై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ మేము ఆ సినిమాలోని ప్రతి ఫ్రేంని అలానే పెట్టాలని అనుకోలేదు. ప్రెగ్నెంట్ గా ఉంది ఉంటె నయనతారకి ఆడియన్స్ నుండి సింపతీ ఈజీగా వచ్చేది కానీ అలా లేకపోవడం వల్ల తనకి పెద్ద చాలెంజ్ గా మారింది. కానీ నయనతార బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ చూపించిందని’ అన్నాడు.
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఎండేమోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ కలిసి నిర్మించారు. ఫిబ్రవరి చివర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.