‘థగ్ లైఫ్’ వీడియో సాంగ్.. త్రిషను లేపేశారుగా..!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘జింగుచా’ అనే వీడియో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.

కానీ, ఈ పాటను థియేటర్లో చూసినవారిక మేకర్స్ గట్టి షాక్ ఇచ్చారు. థియేటర్ వర్షన్‌లో ఈ పాట నిడివి తక్కువగా ఉంటుంది. ఇక ఈ పాటలో పెళ్లి వేడుక జరుగుతుండగా.. దానికి హీరోయిన్ త్రిష కూడా వస్తుంది. కానీ, ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో సాంగ్‌లో ఈ పాట నిడివి ఎక్కువగా ఉంది. అంతేగాక, ఈ పాటలో త్రిష ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ పాటలో ఆమెకు సంబంధించిన సీన్స్ కట్ చేశారని అభిమానులు అంటున్నారు.

ఈ సినిమాలో మరో హీరో శింబు కూడా నటించాడు. నాజర్, జోజు జార్జ్, అభిరామి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version