ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేసే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఒకరు. తన గత చిత్రం ‘కో అంటే కోటి’ సినిమా వచ్చి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. ఆ సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రలో కనిపించిన శర్వానంద్ త్వరలోనే రానున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ఈ చిత్ర ఆడియోని అక్టోబర్ మూడవ వారంలో రిలీజ్ చేసి సినిమాని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళంలో ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా తీసిన చేరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ శర్వానంద్ కి జోడీగా కనిపించనుంది. పూర్తి విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టొరీకి జివి ప్రకాష్ కుమార్ సగీతం అందించగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందిస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.