భారీ ఎత్తున సరిలేరు నీకెవ్వరు సక్సెస్ సెలెబ్రేషన్స్

భారీ ఎత్తున సరిలేరు నీకెవ్వరు సక్సెస్ సెలెబ్రేషన్స్

Published on Jan 15, 2020 8:00 PM IST

మహేష్ సరిలేరు నీకెవ్వరు టీం సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, మహేష్ కి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. ఇప్పటికే ఈ చిత్రం వంద కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ దాటివేసింది. ఈ విజయాన్ని సరిలేరు నీకెవ్వరు టీమ్ అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 17న హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నందు ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

సూపర్ స్టార్ మహేష్, హీరోయిన్ రష్మిక మందానతో పాటు విజయశాంతి, ఇతర ముఖ్య నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయనున్నారు. దీనితో మహేష్ అభిమానులు భారీగా ఈ వేడుకకు హాజరు కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.

తాజా వార్తలు