విక్రం చిత్రంలో నటిస్తున్న కమల్ హసన్ మాజీ భార్య

విక్రం చిత్రంలో నటిస్తున్న కమల్ హసన్ మాజీ భార్య

Published on Oct 11, 2012 7:00 PM IST


కమల్ హాసన్ మాజీ భార్య, శ్రుతి హాసన్ కి తల్లి అయిన సారిక త్వరలో విక్రం ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం “డేవిడ్” చిత్రంలో చిన్న పాత్రలోకనిపించనున్నారు.బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జీవ,నీల్ నితిన్ ముఖేష్,లారా దత్తా , ఇషా శర్వాణి మరియు టబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంలో కవ్వాలి పాటలో సారికని నటించమని దర్శకుడు కోరగా ఆమె ఒప్పుకున్నారు.ఈ పాట ఇప్పటికే చిత్రీకరించబడింది. సారిక చివరి సారిగా అమితాబ్ బచ్చన్ సరసన “షూబైట్” అనే చిత్రంలో కనిపించారు. 2005లో విడుదలయిన “పర్జానియా” చిత్రం విమర్శకుల మెప్పుపొందింది. ఈ చిత్రంలో విక్రం జాలరి వేషంలో కనిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో “డేవిడ్” అనే పేరు గల వివిధ మనుషుల జీవితం గురించిన చిత్రం ఈ చిత్రం. అనిరుద్ రవిచంద్రన్,ప్రశాంత్ పిళ్ళై మరియు రోమియో ఈ చిత్రానికి వివిధ పాటలను కంపోజ్ చేస్తున్నారు. డేవిడ్ జనవరి 11,2013 విడుదల కానుంది

తాజా వార్తలు