“యమహొ యమ” చిత్ర బృందంతో కలిసిన సంజన

“యమహొ యమ” చిత్ర బృందంతో కలిసిన సంజన

Published on Apr 7, 2012 10:05 PM IST


మరో రెండు రోజుల్లో నటి సంజన “యమహొ యమ” చిత్ర బృందంతో చేరబోతుంది. చిత్రంలో ఒకానొక ప్రధాన పాత్రలో ఈ నటి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జితేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రాం శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పార్వతి మెల్టన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సంజన వినోదం పంచె పాత్రగా ఉండబోతుంది. ఈ షెడ్యూల్ లో సాయి రామ్ శంకర్ మరియు పార్వతి మెల్టన్ ల మధ్య రెండు పాటలు దీనితో పాటు సంజన మరియు సాయి రాం శంకర్ మధ్యలో మరొక పాటను చిత్రీకరించనున్నారు.

రాబోయే 25 రోజులు ఈ చిత్రాన్ని లాస్ ఏంజల్స్,మియామి మరియు ఫ్లోరిడాలలో చిత్రీకరించనున్నారు. శ్రీహరి యముడి పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం పూర్తి వినోదాత్మకమయిన చిత్రంగా ఉండబోతుంది. ఈ చిత్రానికి మహతి సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు