మోసం చేశాడంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై హీరోయిన్ పిర్యాదు

నటి సనమ్ శెట్టి తమిళ నటుడు తర్షన్ పై క్రిమినల్ కేసు పెట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వివరాలలోకి వెళితే 2019 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న తర్షన్ మే 2019లో సనమ్ శెట్టి తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఐతే బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం రావడంతో జూన్ లో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేశారు. ఐతే బిగ్ బాస్ అయిన తరువాత కూడా తర్షన్ పలు కారణాలతో పెళ్ళి వాయిదావేస్తూ వచ్చాడు.

ఇక ఇటీవల సనమ్ ను పెళ్లి చేసుకోవడానికి తర్షన్ నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తర్షన్ కెరీర్ ఎదుగుదల కోసం 15 నుండి 20 లక్షలు నా సొంత డబ్బులు ఖర్చుచేశాను అని సనమ్ శెట్టి చెవుతున్నారు. అలాగే తన కారణంగా కెరీర్ పరంగా కూడా వెనుకబడ్డానని సనమ్ శెట్టి ఆరోపిస్తున్నారు.కాగా తర్షన్ ఆమెను పెళ్లాడేది లేదని ఖరాఖండీగా చెవుతున్నారు.

Exit mobile version