‘మిస్టర్ నూకయ్య ‘, కళ్యాణ్ రామ్ ‘కత్తి’ సినిమాలలో నటించిన హీరోయిన్ సనా ఖాన్ కనిపించడం లేదు. 15సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారనే విషయంపై సనా ఖాన్ , ఆమె కజిన్ నవెద్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. అప్పటి నుండి సనా ఖాన్ కనిపించడం లేదంటూ పోలీసులు తెలియజేశారు. ఈ కేసు నమోదు చేసిన ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ ‘సనా ఖాన్ కజిన్ మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడు. ఈ పెళ్లికి మా అమ్మాయి అంగీకరించకపోవడంతో నవెద్, సనా ఖాన్, వారితో పాటుగా కొంతమంది ప్రెండ్స్ కలిసి మా అమ్మాయి స్కూల్ కి వెళ్లి వస్తున్నపుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని’ ఆమె తెలిపింది.
సనా ఖాన్ ఇద్దరు ప్రెండ్స్ గోపీనాథ్ దుబెయ్, విస్మిత్ విలాస్ అంబరులను పోలీసులు అరెస్ట్ చేశారు. సనా ఖాన్ మాత్రం మిస్ అయ్యింది. సనా ఖాన్ మిస్సవడంతో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘మెంటల్’ సినిమా షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఈ సినిమాలో సనా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.