ఇంటర్వ్యూ : సంయుక్త – ‘అఖండ 2’ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది..!

ఇంటర్వ్యూ : సంయుక్త – ‘అఖండ 2’ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది..!

Published on Dec 2, 2025 10:01 PM IST

Samyukta

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

అఖండ2 ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు?

డైరెక్టర్ గారు ఈ కథ గురించి చెప్పారు. ముందు డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగాను. లేవని చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పాను. అప్పుడు వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేశారు. బోయపాటి గారు చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఇమాజినేషన్ కి మించి ఉంటుంది.

బాలయ్య గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

బాలయ్య గారు చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.

తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది?

ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్ శివ కి ట్రిబ్యూట్ లాగా ఉండబోతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్ లో తీసుకెల్తాయి

అఖండ2 నిర్మాతల గురించి?

రామ్ గారు గోపి గారు చాలా మంచి ప్రొడ్యూసర్స్. చాలా సపోర్ట్ గా ఉంటారు. ఇంత పెద్ద సినిమాని చేయడం నిర్మాతలు సపోర్ట్ లేకపోతే సాధ్యం కాదు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

మీ నుంచి రాబోతున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయి?
స్వయంభులో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా నారి నారి నడుమ మురారిలో చాలా మంచి క్యారెక్టర్. అలాగే పూరి గారితో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్.

తాజా వార్తలు