చెన్నై ముద్దుగుమ్మ సమంతకి క్రేజీ హీరోయిన్ గానే గాక యూత్ ఐకాన్ గా కూడా మంచి క్రేజ్ ఉంది. ఆమె లానే ఆమె అభిమానులు కూడా వారి గొప్పతనాన్ని చాటు కున్నారు. ఈ రోజు సమంత అభిమానులు హైదరాబాద్లోని హెమోఫిలియా అనే సొసైటీకి లక్ష రూపాయలు విరాళం అందించారు.
ఈ విషయంతో ఎంతో సంతోషానికి గురైన సమంత తన అభిమానులకు పబ్లిక్ గా ధన్యవాదాలు తెలిపారు. ‘ నా అభిమానులు చేసిన పనికి నేను ఒక గొప్ప అమ్మగా ఫీల్ అవుతున్నాను. చాలా తక్కువ టైంలో నేను ఊహించనంత ఎక్కువ విరాళాలు కలెక్ట్ చేసారు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇందులో పాల్గొన్న సుష్మ, సాయి భరత్, నితీష్ వర్ధన్, శిరీష వర్ధమాన, హర్షిని, శ్రీ హర్ష, నికిత, మైత్రి, శ్రావణ్, మనికేష్, అభి, కిరణ్, రవి భవాని, స్వరూప్, అభిషేక్, సాయి కిరణ్, రజిత పవన్ మరియు నిక్కి వీరందరికీ నా ధన్యవాదాలు’ అని సమంత ట్వీట్ చేసారు.
గతంలో కూడా సమంత అభిమానులు స్ఫూర్తి ఫౌండేషన్ కోసం విరాళాలు కలెక్ట్ చేసారు. ఇప్పటి వరకూ మనం మన తెలుగులో ఉండే పెద్ద హీరోల అభిమానులు మాత్రమే ఇలా కలెక్ట్ చేయడం చూసాము, కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా మొదటిసారిగా ఒక హీరోయిన్ ఫాన్స్ మనీ డొనేట్ చేయడం మరియు కలెక్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి.