పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న సమంత?

పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న సమంత?

Published on Sep 29, 2012 11:52 AM IST

ఇప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సమంత ఆదిపత్యం తగ్గేలా కనిపించట్లేదు. ఇప్పటికే తమిళ మరియు తెలుగులో ప్రముఖ దర్శకులతో పనిచేస్తున్న ఈ భామ కొంతమంది ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెయ్యబోతున్న చిత్రంలో సమంత కథానాయికగా చేయ్యనుంది. గతంలో ఈ చిత్రం కోసం ఇలియానాని ఎంచుకోవాలని అనుకున్నారు. సమంత ఈ పాత్రను చేస్తున్నట్టు దాదాపుగా ఖరారు అయ్యింది. త్వరలో అధికారిక ప్రకటన చెయ్యనున్నారు. కొన్నేళ్ళ క్రితం “జల్సా” చిత్రంతో పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించారు. మానవ విలువల మీద తెరకెక్కించబోయే ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్ర నవంబర్లో మొదలు కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

తాజా వార్తలు